సూపర్ స్టార్ కృష్ణ అనౌన్సు చేసిన ‘మహేష్ 26’ టైటిల్..?

  • May 31, 2019 / 11:30 AM IST

‘రాజకుమారుడు’ నుండీ ‘మహర్షి’ వరకూ 25చిత్రాలు పూర్తిచేసుకున్నాడు మహేష్ బాబు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ… ఎన్నో ప్రయోగాలుచేసినప్పటికీ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక తన తండ్రి కృష్ణ గారి 76వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ 26 వ చిత్ర టైటిల్, మరియు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్సు చేసారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్‌ తో రూపొందే ఈ చిత్రాన్ని ‘ఎఫ్2’ ఫేం అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.

‘రాజకుమారుడు’ దగ్గరి నుండీ మహేష్ నటించిన సినిమా టైటిల్స్‌తో రూపొందించిన ఓ వీడియోను ద్వారా ఈ టైటిల్ ను అనౌన్సు చేసారు. సిల్వర్‌జూబ్లీ పూర్తి చేసుకున్న మహేష్ ఈ చిత్రంతో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నారని ఈ వీడియో లో ఉంది. ఇక టైటిల్‌ చివర్లో తుపాకీ దాని పై సోల్జర్‌ క్యాప్‌ చూస్తుంటే ఇది ఆర్మీ నేపథ్యంతో కూడిన సినిమాలా అనిపిస్తుంది. ఇక మే 31న(ఈరోజు) ‘అన్నపూర్ణ స్టూడియోస్’ లో 9.18 amకి అధికారికంగా పూజ కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కేవలం 6 నెలల్లో పూర్తి చేయడానికి అనిల్ పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ప్రస్తుతం తన ఫ్యామిలితో యూరఫ్ వెకేషన్లో ఉన్న మహేష్ తిరిగి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే షూటింగులో జాయిన్ అవ్వనున్నాడు. ఇక ఈ చిత్రంలోని పూర్తి నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus