‘సరిలేరు నీకెవ్వరు’ 4 వీక్స్ కలెక్షన్స్…!

  • February 8, 2020 / 05:51 PM IST

విజయవంతంగా 4 వారాలు పూర్తిచేసుకుంది మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం.. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రం డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. పోటీగా మరో 3 సినిమాలున్నప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు స్టడీ గా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ వీకెండ్ కనుక ఈ చిత్రం నిలదొక్కుకుంటే 220 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ఇక ఈ చిత్రం 28 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 39.14 cr
సీడెడ్ 15.46 cr
ఉత్తరాంధ్ర 19.58 cr
ఈస్ట్ 11.22 cr
వెస్ట్ 7.37 cr
కృష్ణా 8.77 cr
గుంటూరు 9.82 cr
నెల్లూరు 3.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 9.30 cr
ఓవర్సీస్ 11.94 cr
వరల్డ్ వైడ్ టోటల్ 136.57 cr (share)

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 4 వారాలు పూర్తయ్యేసరికి 136.57 కోట్ల షేర్ ను రాబట్టింది. 28 వ రోజున కూడా ఈ చిత్రం 0.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. 218.90 కోట్లను కొల్లగొట్టింది. నిన్న ‘జాను’ చిత్రం విడుదలయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ .. ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్స్ స్టడీ గా ఉన్నాయి. అయితే ఈ వారంతో ఈ చిత్రం కలెక్షన్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి 220 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటుతుందో లేదో చూడాలి.

Click Here To Sarileru Neekevvaru Movie Review

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus