‘సరిలేరు నీకెవ్వరు’ 9 డేస్ కలెక్షన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆయన అభిమానుల్ని మాత్రమే కాదు మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నాడు. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా వచ్చినప్పటికీ రేటింగ్ లు మాత్రం ఎందుకో ఎక్కువ పడలేదు. ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఏమాత్రం తగ్గలేదు. తక్కువ థియేటర్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి.

ఇక ఈ చిత్రం 9 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 32.01 cr
సీడెడ్ 13.69 cr
ఉత్తరాంధ్ర 15.88 cr
ఈస్ట్ 9.75 cr
వెస్ట్ 6.35 cr
కృష్ణా 7.77 cr
గుంటూరు 8.89 cr
నెల్లూరు 3.41 cr
ఏపీ+తెలంగాణ 97.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.51 cr
ఓవర్సీస్ 10.59 cr
వరల్డ్ వైడ్ టోటల్ 116.85  cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన 9 రోజులు పూర్తయ్యేసరికి 116.85 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సూపర్ హిట్ రిపోర్ట్స్ వచ్చినా.. దాంతో తక్కువ థియేటర్స్ మాత్రమే దక్కినా.. ఈ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈరోజు నుండీ మొదలుకాబోతుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం ఎంతవరకూ రాణి స్తుందో చూడాలి.

Click Here To Sarileru Neekevvaru Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus