మహేష్ సినిమాకి మరోసారి అదిరిపోయే బిజినెస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు లిరికల్ సాంగ్స్.. సినిమా పై అంచనాల్ని పెంచేశాయనే చెప్పాలి.

దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది.

నైజాం 25 cr
సీడెడ్ 12 cr
ఉత్తరాంధ్ర 9.60 cr
ఈస్ట్ 7.50 cr
వెస్ట్ 5.50 cr
కృష్ణా 6.30 cr
గుంటూరు 7.50 cr
నెల్లూరు 3.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 10.10 cr
ఓవర్సీస్ 13.60 cr
వరల్డ్ వైడ్ టోటల్ 100.30 cr (share)

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 100.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 101 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మహేష్ గత చిత్రం ‘మహర్షి’ ఫుల్ రన్లో 101 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. అప్పుడు సోలో రిలీజ్ కాబట్టి ఆ ఫీట్… సాధ్యమయ్యింది. మరి ఇప్పుడు పోటీగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ కూడా విడుదల కాబోతుంది. మరి ఈ సంక్రాంతికి మహేష్ సినిమా 101 కోట్ల షేర్ ను రాబడుతుందా.. లేదా… అనేది చూడాలి..!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus