నాని (Nani) – వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య (SJ Suryah) పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి (Saripodhaa Sanivaaram Collections) ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.70 cr |
సీడెడ్ | 0.72 cr |
ఉత్తరాంధ్ర | 0.75 cr |
ఈస్ట్ | 0.31 cr |
వెస్ట్ | 0.30 cr |
గుంటూరు | 0.31 cr |
కృష్ణా | 0.40 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.85 Cr |
ఓవర్సీస్ | 4.40 Cr |
మిగిలిన భాషలు | 0.20 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.15 cr |
‘సరిపోదా శనివారం’ చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.11.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.33.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.