హ్యాట్రిక్ విజయాల తరువాత మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గీతా గోవిందం సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. 2022 సంక్రాంతి పండగ కానుకగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మే 31వ తేదీన సర్కారువారి పాట టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాకు పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ సైతం ఒక నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా ఆరోజే టీజర్ రావచ్చని వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ పూర్తి కాగా గోవా షెడ్యూల్ జరగాల్సి ఉంది. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభం కాగా కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ మూవీ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. మే 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల టీజర్లు, ట్రైలర్లు వ్యూస్, లైక్స్ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేయగా మహేష్ బాబు ఆ రికార్డులను సర్కారు వారి పాట టీజర్ తో బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.