టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బోయపాటి కలసి చేసిన పక్కా మాస్ మసాలా ఈ సరైనోడు. అయితే ఈ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బన్నీ…వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి వీళ్ళిద్దరి కాంబినేషన్ పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా విడుదల తరువాత సినిమా అంచనాలను మించి ఉందా లేదా అన్న మాట పక్కన పెడితే, సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే అల్లు అర్జున్ క్రేజ్, బోయపాటి టేకింగ్ రెండూ కలగలిపి ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికీ 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అని బన్నీ అభిమానులు చెబుతుంటే, దీనిపై కొన్ని అభిమాన సంఘాలు ఫేస్ బుక్, ట్విటర్ లో చెలరేగిపోతున్నారు. ఇక మరో పక్క అల్లుఅర్జున్ కెరీర్ లో ఇప్పటి వరకూ 100 కోట్ల రూపాయలు ఏ మూవీ సాధించలేదు. ఒక్క సరైనోడు మూవీ మాత్రమే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించింది అని అభిమానులు ఆనందంలో మునిగి తెలిపోతున్నారు. ఇదిలా ఉంటే…అసలు ఈ సినిమాకు ట్రేడ్ లెక్కల ప్రకారం ఎంత వచ్చింది అంటే…టాలీవుడ్ బాక్సాపీస్ లెక్కల ప్రకారం ఈ మూవీ ఇప్పటి వరకూ 50 నుండి 60 కోట్ల రూపాయలను మాత్రమే కలెక్ట్ చేసినట్టుగా లెక్కలు కనిపిస్తున్నాయి. మరి సినిమాపై క్రేజ్ పెంచేందుకు అభిమానులు అలా పబ్లిసిటీ ఇస్తున్నారో…లేక నిజంగానే ఈ సినిమా 100కోట్ల గ్రాస్ ను దాటిందో తెలీదు కానీ మొత్తానికి సరైనోడు కలెక్షన్స్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్.