మెగా హీరోల సినిమాలు అన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడటంతో, మరో మూడు రోజుల్లో విడుదల కానున్న బన్నీ ‘సరైనోడు’పై భారీ అంచనాలే పెట్టుకున్నారు మెగా అభిమానులు. అయితే సినిమా కాంబినేషన్, ప్రమోషన్, టీజర్, ట్రైలట్ పరంగా అద్భుతంగా ఉంది. కానీ, ఎక్కడో ఏదో తెలియని సందేహం. మొదటి నుంచి ఈ సినిమాకు ఎక్కడో ఒక చోట నెగేటివ్ టాక్ వస్తూనే ఉంది. మరో పక్క అల్లు అర్జున్ ఇప్పటివరకూ సొంత బ్యానర్ లో చేసిన రెండు సినిమాలు భారీ ఫ్లాప్స్ కావడం, ఆ సెంటిమెంట్ సైతం సినిమాకు చిక్కులు తెచ్చిపెట్టేలాగా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే థియాట్రికల్ ట్రైలర్ లో మొత్తం యాక్షన్ ఎపిసోడ్ ను ప్రేక్షకుల కళ్ళ ముందు ఉంచిన దర్శకుడు గతంలో చేసిన తప్పే మళ్లీ చేశాడా అన్న వాదన వినిపిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము గుర్తుందిగా, సింహ, లెజెండ్, లాంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన బోయపాటి దమ్ము విషయంలో సైతం అంతే రేంజ్ లో సినిమా చిత్రీకరణ చేశాడు…కానీ తొలి భాగం ఎంత ఆకట్టుకుంటుందో, మలిభాగంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు, సినిమాను బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిపాయి. ఇప్పుడు సరైనోడు విషయంలోను అదే రిపీట్ అవుతుంది ఏమో అన్న భయంతో ఉన్నారు అభిమానులు ఎందుకంటే, సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి సినిమా సర్కిల్స్ లో బ్యాడ్ టాక్ మొదలయ్యింది.. సినిమా సెకెండ్ హాఫ్ యావరేజ్ అన్న టాక్ బయటకు రావడంతో ఈ సినిమా మరో దమ్ము అవుతుంది ఏమో అని భయానక వాతావరణం ఏర్పడింది. మరి దీనికి సమాధానం కావాలంటే మాత్రం ఈ శుక్రవారం వరకూ ఆగాల్సిందే…