Satya Review in Telugu: సత్య సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 10, 2024 / 06:31 PM IST

Cast & Crew

  • హమరేశ్ (Hero)
  • ప్రార్ధనా సందీప్ (Heroine)
  • అక్షయయ హరిహరణ్‌ , 'ఆడుగాలం' మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు (Cast)
  • వాలీ మోహన్‌దాస్ (Director)
  • శివమల్లాల (Producer)
  • సుందరమూర్తి కె.యస్, (Music)
  • ఐ. మరుదనాయగం (Cinematography)

ఈ వారం కూడా కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో భాగంగా తమిళంలో హిట్ అయిన ‘రంగోలి’ చిత్రాన్ని ‘సత్య’ పేరుతో తెలుగులోకి రిలీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా మారుతూ చేసిన ఈ ‘సత్య’ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : సత్య(హమరేష్‌) పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ….మరోపక్క ఫ్రెండ్స్ తో ఆడుకోవడం అనేది అతని దినచర్యలో భాగం. సత్య తండ్రి గాంధీ(ఆడుకాలం మురుగదాస్‌) లాండ్రి వర్క్ చేస్తుంటాడు. అతనికి సత్యతో పాటు ఓ కూతురు లక్ష్మి(అక్షయ హరిహరణ్‌) ఉంటుంది. ఆమె చదువు మానేసి తండ్రి, తల్లికి సహాయంగా ఉంటుంది.వీరిని కంటికి రెప్పలా చూసుకోవడం గాంధీ భార్య కళ(సాయి శ్రీ ప్రభాకరణ్‌) కి అలవాటు. ఇదిలా ఉండగా.. సత్య స్కూల్లో గొడవపడి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడు.

దీంతో సత్య ఫ్రెండ్ సర్కిల్ బాలేదు అని భావించిన గాంధీ.. లక్షల్లో అప్పు చేసి మరీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అయితే అక్కడి స్టూడెంట్స్ సత్యని లో-క్లాస్ అంటూ చిన్న చూపు చూస్తూ ఉంటారు.పైగా సత్య ఒక్క తెలుగులో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో అవుతూ ఉంటాడు. దీంతో అతను చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో పార్వతి(ప్రార్థన సందీప్) సత్య పై జాలి చూపిస్తుంది.

దీంతో తెలీకుండానే ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే మధ్యలో వీరికి ఓ సమస్య వచ్చి పడుతుంది అది ఏంటి? అలాగే సత్య చదువు కోసం అతని కుటుంబం పడే కష్టాలు కూడా అతనికి నచ్చవు. అందువల్ల చదువు పై శ్రద్ధ పెట్టలేకపోతాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అతని కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : హమరేష్ సతీష్ .. విక్రమ్ హీరోగా వచ్చిన ‘నాన్న’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ కి ఇతను మేనల్లుడు అవుతాడు. ‘సత్య’ లో ఇతను టైటిల్ రోల్ పోషించాడు. అతని వరకు సహజంగా నటించాడు. ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. స్కూల్ పిల్లాడిలా ఇతని లుక్ కూడా సెట్ అయ్యింది. అయితే ఇతని తండ్రి పాత్ర చేసిన ‘ఆడుకలామ్’ మురుగదాస్ నటన పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసాడు అని చెప్పాలి. చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇతని పాత్ర.

అంతేకాదు కథ మొత్తం మొదలయ్యేది, హ్యాపీ ఎండింగ్ పడేది కూడా ఇతని పాత్ర వల్లే అని చెప్పాలి. ఇక హీరోయిన్ గా చేసిన ప్రార్థన సందీప్.. బాగానే నటించింది. కాకపోతే ఈమె లుక్స్ చైల్డ్ ఆర్టిస్ట్ నే తలపిస్తాయి తప్ప ఈమె హీరోయిన్ అనే ఫీలింగ్ ని కలిగించవు. ఇక హీరో తల్లి పాత్ర చేసిన సాయి శ్రీ ప్రభాకరణ్‌,అక్క పాత్ర చేసిన అక్షయ హరిహరణ్‌ కూడా మంచి మార్కులు వేయించుకుంటారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు వాలి మోహన్ దాస్ మురుగన్ తీసుకున్న కథ ఏమీ కొత్తది కాదు. కానీ సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు తమ స్కూల్ డేస్ గుర్తు చేసుకునేలా కథనాన్ని అయితే నడిపించాడు. అంతేకాదు ఈ కథ ద్వారా అతను కొన్ని సామాజిక అంశాలను కూడా టచ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ‘ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదు’ అని కొంతమంది, పెద్ద స్కూల్స్ లో చదివిస్తే టీనేజ్..లోనే ప్రేమ, పెళ్లి అంటూ పిల్లలు చెడిపోతారు అని ఇంకొంతమంది.. సమాజంలో ఉన్న జనాలు పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులని ఎలా ప్రేరేపిస్తారు? వాటి వల్ల ఆ పేద కుటుంబాలకి చెందిన తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులకి గురవుతారు’ అనే పాయింట్ ని చాలా చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు అని చెప్పాలి.

ఫస్ట్ హాఫ్ ఓకే.. బాగానే ముగిసినట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో స్లో నెరేషన్ వల్ల ల్యాగ్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అనవసరపు సన్నివేశాలు పెట్టి.. కొంత ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. మొత్తంగా ఓకే అనిపిస్తుంది ఈ సినిమా. మరోపక్క సంగీతం విషయానికి వస్తే.. పాటలు బాగానే ఉన్నాయి కానీ అందరికీ కనెక్ట్ అయ్యేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే.. ! సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో తల్లిదండ్రులు స్కూటీ పై వెళ్తున్న సీన్, మళ్ళీ క్లైమాక్స్ లో అదే స్కూటీ పై వెళ్లే సీన్… లను పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది.

ఆ సీన్స్ కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్ క్లైమాక్స్ డిఫరెంట్ ఉంటుంది. నిర్మాత శివ మల్లాల దగ్గరుండి క్లైమాక్స్ మార్పించుకున్నట్టు ప్రమోషన్స్ లో చెప్పాడు. నిజంగా తెలుగు వెర్షన్ క్లైమాక్స్ చూస్తే శివ మల్లాలకి ఫిలిం మేకింగ్ పై మంచి పట్టు ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది.

విశ్లేషణ : ‘సత్య’..అందరినీ స్కూల్ డేస్ కి తీసుకెళ్ళే ఓ ఫీల్ గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ స్లోగా అనిపించినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు కూడా ఉండటంతో.. కచ్చితంగా ఒకసారి చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus