‘ఆర్ఆర్ఆర్’ (RRR) లాంటి సినిమాలో ఛాన్స్ రావడం అంటే ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి. రాజమౌళి (S. S. Rajamouli) – రామ్‌చరణ్ (Jr NTR) – ఎన్టీఆర్ (Ram Charan) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు, ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సినిమాలో నటించి, ఎడిటింగ్‌లో ఎగిరిపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఇలాంటి పరిస్థితే ఎదురైంది యువ నటుడు సత్యేదవ్కి. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 16 నిమిషాల సన్నివేశాల్ని సినిమ నుండి తీసేశారట.
Satyadev
తను నటించిన ‘జీబ్రా’ (Zebra) సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో వరుసగా మాట్లాడుతున్న సత్యదేవ్ (Satya Dev) ‘ఆర్ఆర్ఆర్’ గురించి కూడా మాట్లాడాడు. సినిమా వచ్చిన ఇన్నేళ్లు అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆయన దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. అడిగిన ఆయనకు ఎలా తెలుసు అనేది తెలియదు కానీ.. ఈ విషయం అయితే వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తాను నటించినట్లుగా చెప్పిన ఆయన.. తన సన్నివేశాలను తీసేశారనే విషయాన్ని ఇప్పుడే తొలిసారి చెబుతున్నా అని చెప్పాడు.
ఇంతవరకు ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పలేదని, టీమ్ మీద, టీమ్ నిర్ణయం మీద ఉన్న గౌరవంతో ఈ విషయం ఇన్నాళ్లూ ఎక్కడా మాట్లాడలేదని చెప్పాడు. ఇక్కడో విషయం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం సత్యదేవ్ 15 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడట. చివరకు ఆ ట్రాక్ సినిమాలో ఫిట్ కావడం లేదని ఎడిటింగ్‌లో తీసేశారని సత్యదేవ్ (Satyadev) చెప్పాడు.
అయితే సినిమాలో సత్యదేవ్ ఉండి ఉంటే, ఆ పాత్ర క్లిక్ అయితే ఉంటే కచ్చితంగా కెరీర్‌కు మంచి గుర్తింపు దక్కేది అని పక్కాగా చెప్పొచ్చు. ఇక సత్యదేవ్ హిందీలో అక్షయ్ కుమార్ ‘రామ సేతు’ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక సత్యదేవ్ చేసిన రీసెంట్ సినిమా ‘కృష్ణమ్మ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ థియేటర్లలో అంతగా ఆడలేదు. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ‘జీబ్రా’ సినిమా అయినా సత్యదేవ్(Satyadev) ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.