శిక్షణ దశలోనే ప్రభాస్ లోని ప్రతిభను గుర్తించిన సత్యానంద్
- November 14, 2016 / 01:36 PM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లోని ప్రతిభను శిక్షణ దశలోనే సత్యానంద్ గుర్తించారు. ఇతని వద్ద తెలుగు హీరోలు అనేక మంది నటనలో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రభాస్ కూడా మెళకువలు నేర్చుకున్నారు. డార్లింగ్ సినిమాల్లోకి అడుగు పెట్టక ముందే గుర్తించిన సంగతిని ఆయన గుర్తుచేసుకున్నారు. “ప్రభాస్‌ను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం, టాప్ హీరో అవుతాడని అతని సోదరి, బావలకు చెప్పాను. అయితే అప్పుడు వాళ్లు నమ్మలేదు. నిజంగా ప్రభాస్ స్టార్ హీరో అవుతాడా? అంటూ మళ్లీ.. మళ్లీ అడిగారు.
ఎంత చెప్పినా.. వాళ్లు ఏదో ఓ మూల అనుమానం పెట్టుకున్నారు. వాళ్లు అప్పుడు నమ్మకపోయినా.. ఇప్పుడు మాత్రం నమ్ముతున్నారు” అని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సత్యానంద్ వెల్లడించారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. ఈ ఒక్క చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ టాప్ హీరోలలో ఒకరిగా యంగ్ రెబల్ స్టార్ స్థానం సంపాదించుకున్నారు. ఇండియన్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ లో ప్రస్తుతం డార్లింగ్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















