Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • June 19, 2026 / 09:30 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రియ‌ద‌ర్శి, చైత‌న్య కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌ఠం (Hero)
  • జోర్దార్ సుజాత‌, దేవ‌యాని, పావ‌ణి గంగిరెడ్డి. (Heroine)
  • వెన్నెల‌కిషోర్‌, గంగ‌వ్వ‌, అభ‌య్‌, రాకింగ్ రాకేష్‌, మిర్చి కిర‌ణ్ త‌దిత‌రులు (Cast)
  • శ్రీరామ్ ఎర‌గం (Director)
  • శివ మేక, సాహితీ చింతలపూడి (Producer)
  • అజ‌య్ అర‌సాడ‌ (Music)
  • విశ్వేశ్వర్ సిలకోటి (Cinematography)
  • NA (Editor)
  • Release Date : 19th జూన్ 2026
  • త్రీ ఆటోమ‌న్ లీవ్స్ బ్యాన‌ర్‌ (Banner)

ప్రియ‌ద‌ర్శి, చైత‌న్య కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌ఠం ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సేవ్ ది టైగ‌ర్స్ గ‌త రెండు సీజ‌న్లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఈ సిరీస్‌లో మూడో సీజ‌న్‌ శుక్ర‌వారం జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ సిరీస్‌కు మ‌హి వి రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం క్రియేట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించారు. శ్రీరామ్ ఎర‌గం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జోర్దార్ సుజాత‌, దేవ‌య‌ని, పావ‌ణి గంగిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు సోషియో ఫాంట‌సీ క‌థ‌తో తెర‌కెక్కిన సేవ్ ది టైగ‌ర్స్ 3 తెలుగు ఆడియెన్స్‌ను న‌వ్వించిందా? లేదా? అంటే?

Save The Tigers 3 Review

Save The Tigers 3 Review and Rating

క‌థ‌: ఎమ్మెల్యే కావాల‌నే ప్ర‌య‌త్నంలో ఆస్తుల‌న్నీ పోగొట్టుకుంటాడు గంటా ర‌వి (ప్రియ‌ద‌ర్శి). ఎన్నిక‌ల్లో ఓడిపోతాడు. మ‌రోవైపు భార్య హైమా (జోర్దార్ సుజాత‌) పోరు ప‌డ‌లేక బ‌స్తీలోని త‌న ఇంటి నుంచి గేటేడ్ క‌మ్యూనిటీకి షిప్ట‌వుతాడు. మ‌న‌శ్శాంతి లేకుండాపోతుంది. విక్ర‌మ్‌కు (చైత‌న్య కృష్ణ‌) అత‌డి భార్య రేఖ (దేవ‌యాని) విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రేఖ పెట్టిన కేసు కార‌ణంగా అత‌డి జాబ్‌తో పాటు స్టార్ట‌ప్ కంపెనీ మూత‌ప‌డుతుంది. భార్య మాధురి (పావ‌ని గంగిరెడ్డి) కోసం జాబ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు రాహుల్‌(అభిన‌వ్ గోమ‌ఠం). కానీ నోటి దూళ వ‌ల్ల కొద్ది రోజుల్లోనే ఉద్యోగం పోతుంది. భ‌ర్త బాధ్య‌త‌లు లేకుండా ఉండ‌టం న‌చ్చ‌ని మాధురి త‌న ప్రెగ్నెన్సీ తీయించుకోవాల‌ని అనుకుంటుంది. ఈ విష‌యంలో ఇద్ద‌రు గొడ‌వ‌లు ప‌డ‌తారు.

ఓ రోజు తాగిన మ‌త్తులో గంటార‌వి, విక్ర‌మ్‌, రాహుల్ మ‌రో ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు? ఆ కిడ్నాప్ అయిన‌వాళ్లు వీళ్ల పోలిక‌ల‌తో ఎందుకు ఉన్నారు? ఇంద్రుడు (వెన్నెల‌కిషోర్‌) వీరికి ఇచ్చిన ప‌నిష్‌మెంట్ ఏంటి? ఈ లోకంలో తీర‌ని కోరిక‌ల‌ను మ‌రో ప్ర‌పంచంలో గంటా ర‌వి, విక్ర‌మ్‌, రాహుల్ ఎలా నెర‌వేర్చుకున్నారు? గేటెడ్ క‌మ్యూనిటీలో హైమాఎలాంటి ఇబ్బందులు ప‌డింది? గంటా ర‌వి ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యాడు? అమాయ‌కుడైన రాహుల్‌పై వంద‌కుపైగా అమ్మాయిల వేధింపుల కేసులు న‌మోదు కావ‌డానికి కార‌ణ‌మేంటి? ఫేమ‌స్ సినిమా రైట‌ర్ కావాల‌నే రాహుల్ క‌ల ఏ విధంగా తీరింది? లోకాల స్వాపింగ్ వ‌ల్ల ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్స్ క్రియేట్ అయ్యాయి? అన్న‌దే ఈ వెబ్ సిరీస్ క‌థ‌.

Save The Tigers 3 Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్‌లో మూడు జంట‌లు రెండు షేడ్స్‌తో కూడిన పాత్ర‌ల్లో క‌నిపించారు. అవినీతిప‌రుడైన ఎమ్మెల్యేగా, గేటెడ్ క‌మ్యూనిటీలో ఇబ్బంది ప‌డే హైద‌రాబాదీ యువ‌కుడిగా రెండు పాత్ర‌ల్లో ప్రియ‌ద‌ర్శి చ‌క్క‌టి వేరియేష‌న్‌ను చూపించాడు. ల‌వ‌ర్‌బాయ్‌గా, ఇన్నోసెంట్ యువ‌కుడిగా చైత‌న్య కృష్ట మెప్పించారు. అభిన‌వ్ గోమ‌టం కామెడీ టైమింగ్ ఈ సిరీస్‌కు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. సినిమా రైట‌ర్‌గా అభిన‌వ్ పంచ్‌లు హిలేరియ‌స్‌గా న‌వ్వించాయి.

జోర్దార్ సుజాత పాత్ర మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా డిజైన్ చేశారు. దేవ‌యాని, పావ‌ణి గంగిరెడ్డి న‌ట‌న ఒకే. గ‌త సీజ‌న్ల‌లో రోహిణి కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఈ సారి ఆమె పాత్ర అంత‌గా న‌వ్వించ‌లేక‌పోయింది. రాకేష్‌, గంగ‌వ్వ‌, మిర్చి కిర‌ణ్‌, అభ‌య్‌, గుండు సుద‌ర్శ‌న్ ల‌ను స‌రిగ్గా వాడుకోలేదు. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ రోల్ ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. త‌నదైన శైలి మ్యాన‌రిజ‌మ్స్‌, ఇంగ్లీష్ డైలాగ్స్‌తో క‌నిపించినంత సేపు న‌వ్వించారు.

Save The Tigers 3 Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: లోకాల స్వాపింగ్‌ కాన్సెప్ట్‌తో సేవ్ ది టైగ‌ర్స్ మూడో సీజ‌న్ క్రియేట్ చేశారు మ‌హి వి రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం. భార్య‌భ‌ర్త‌ల గొడ‌వ‌లు, ప్ర‌స్టేష‌న్ల‌పై ఫోక‌స్ పెట్ట‌కుండా సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్‌తో మూడో సీజ‌న్‌ను న‌డిపించారు. డైరెక్ట‌ర్‌ శ్రీరామ్ ఎర‌గం టేకింగ్ బాగుంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉన్నాయి. అజ‌య్ అర‌సాడ బీజీఎమ్ సిరీస్ స్థాయిలోనే ఉంది.

Save The Tigers 3 Review and Rating

విశ్లేష‌ణ‌: మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురు ఉన్న‌ట్లే లోకాల‌ను పోలిన లోకాలు ఏడు ఉంటాయ‌ని అంటుంటారు. ఓ లోకంలో ఉన్న‌వారు మ‌రో లోకంలోకి అనుకోకుండా ఎంట‌రైతే ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే క‌న్ఫ్యూజ‌న్స్ సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 సాగుతుంది. ఇలాంటి పాయింట్‌ను త‌డ‌బాటు లేకుండా స్క్రీన్‌పై చెప్ప‌డం అంత ఈజీ కాదు. ఏ మాత్రం అటు ఇటు అయినా మొద‌టికే మోసం వ‌స్తుంది. మేక‌ర్స్‌కు కావాల్సినంత టైమ్ దొర‌క‌డంతో డీటైలింగ్‌గా ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్లు లేకుండా ఈ క‌థ‌ను ఆరు ఎపిసోడ్స్‌తో చెప్పారు.

ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఓ లోకంలో తీర‌కి కోరిక‌ల‌ను మ‌రో లోకంలో తీర్చుకోవాల‌ని అనుకున్న గంటా ర‌వి, విక్ర‌మ్‌, రాహుల్‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి అన్న దాంట్లో న‌వ్విస్తూనే అంత‌ర్లీనంగా మెసేజ్‌ను చూపించారు. అలాగ‌ని మేయిన్ కోర్ పాయింట్ నుంచి దూరం కాలేదు. భార్యాభ‌ర్త‌ల బంధం నిల‌బ‌డాలంటే ఇద్ద‌రి మ‌ధ్య స‌రైన అండ‌ర్‌స్టాండింగ్ ఉండాల‌ని చూపించారు. చివ‌రి వ‌ర‌కు ఏదో జ‌రుగుతుంది అనే స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేశారు. కానీ కామెడీ డోసు త‌గ్గుతూ పోవ‌డం ఈ సిరీస్‌కు మైన‌స్‌గా మారింది. గ‌త సీజ‌న్ల స్థాయిలో పంచులు, ప్రాస‌లు మిస్స‌య్యాయి. అదే మైన‌స్‌గా మారింది. సిరీస్ ర‌న్‌టైమ్ మూడు గంట‌ల పైనే ఉండ‌టం ఓపిక‌కు ప‌రీక్ష‌లా మారింది.

Save The Tigers 3 Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: కామెడీ త‌క్కువ‌… సాగ‌తీత ఎక్కువ‌.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Chaitanya Krishna
  • #Deviyani Sharma
  • #Jordar Sujata
  • #Pavani Gangireddy

Reviews

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

18 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

17 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

18 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

2 days ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version