Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’
- November 14, 2026 / 11:54 PM ISTByPhani Kumar
‘వీరభద్రుడు’ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో సూపర్ ఫామ్లోకి వచ్చిన సూర్య.. ఇప్పుడు ‘సీన్'(Scene) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళం యంగ్ సెన్సేషన్ నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించారు. ‘జగరం స్టూడియోస్’ ‘2D ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి.
Scene
ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

| నైజాం | 6.67 cr |
| సీడెడ్ | 0.92 cr |
| ఆంధ్ర(టోటల్) | 4.57 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 12.16 cr(షేర్) |
| తమిళనాడు | 30.6 cr |
| మలయాళం | 10.28 cr |
| కర్నాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.72 cr |
| ఓవర్సీస్ | 34.45 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 95.21 cr(షేర్) |
‘సీన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.77.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం రూ.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కోసం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి.
6 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.95.21 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.189 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులకి గాను ఈ చిత్రం రూ.12.16 కోట్ల షేర్ ను రాబట్టింది.6వ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.16 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ గా నిలిచింది.
















