Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్
- November 11, 2026 / 08:39 PM ISTByPhani Kumar
‘వీరభద్రుడు’ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో సూపర్ ఫామ్లోకి వచ్చిన సూర్య.. ఇప్పుడు ‘సీన్'(Scene) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళం యంగ్ సెన్సేషన్ నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించారు. ‘జగరం స్టూడియోస్’ ‘2D ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి.
Scene
ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

| నైజాం | 6.07 cr |
| సీడెడ్ | 0.86 cr |
| ఆంధ్ర(టోటల్) | 4.03 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 10.96 cr(షేర్) |
| తమిళనాడు | 28.1 cr |
| మలయాళం | 9.23 cr |
| కర్నాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.42 cr |
| ఓవర్సీస్ | 31.8 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 86.51 cr(షేర్) |
‘సీన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.77.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం రూ.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కోసం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి.
5 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.86.51 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.172 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజులకి గాను ఈ చిత్రం రూ.10.96 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.















