మహేష్ హెల్త్ సీక్రెట్ ఇదేనా?
- February 2, 2017 / 11:40 AM ISTByFilmy Focus
తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్ లో మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. వందకోట్లతో ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫిల్మ్ నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 11 నుంచి ముంబయిలో మొదలుకానుంది. ఈ గ్యాప్ లో మహేష్ మలేషియా వెళ్లారు. ఎప్పుడూ టూర్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్లే ప్రిన్స్ ఇప్పుడు ఒంటరిగా వెళ్లడంతో అందరికీ సందేహం కలిగింది. ఎందుకు మలేషియా వెళ్లారు? అని అరా తీయగా అసలు విషయం బయట పడింది.
మహేష్ ఆరోగ్యం కోసం, వైద్యులను కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. సూపర్ స్టార్ ప్రతి సంవత్సరం డీ టాక్సినేషన్ చేయించుకుంటారు. అంటే శరీరంలోని మలినాలను తొలిగించుకుంటుంటారు. దీనికి కొన్ని మందులు, వ్యాయామం అవసరమవుతాయి. ప్రత్యేక మసాజ్ కూడా చేయించుకోవాలి. వీటికి మలేషియాలోని ఆస్పత్రులు బాగా ఫేమస్. అందుకే మహేష్ అక్కడికి వెళ్లారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మహేష్ స్కిన్ ప్రకాశవంతంగా మెరవడం వెనుక డీ టాక్సినేషన్ వైద్యం పాత్ర కూడా కొంత ఉందని అర్ధమయింది. ఇక ఈ ట్రీట్ మెంట్ కి క్రేజ్ పెరగడం గ్యారంటీ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















