కెరీర్ మొదటి నుండీ రొటీన్ కథలకి దూరంగా ఉంటూ.. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలకే ఓటేస్తూ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ వచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అందుకే స్టార్ హీరోలు లేకపోయినా కొత్తవాళ్ళతోనే ఆయన సినిమాలు భారీ విజయాల్ని నమోదు చేస్తూ వచ్చాయి. మధ్యలో ‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘అనామిక’ వంటి చిత్రాలు ప్లాపైనా.. ‘ఫిదా’ చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు నాగచైతన్య తో కూడా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండేళ్ళ గ్యాప్ లో కొత్త వాళ్ళతో ఓ సినిమా కూడా స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా 50 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ సడెన్ గా చైతూ – సాయిపల్లవిలతో తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా పూర్తవుతుంది కాబట్టి.. చైతూ సినిమాను మొదలుపెడుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ కొత్తవాళ్ళతో మొదలుపెట్టిన సినిమాని ఆగిపోవడంతో శేఖర్ కమ్ముల ఆపేశాడనేది తాజా సమాచారం. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తి లేకపోవడం వలనే శేఖర్ కమ్ముల ఈ కొత్త ప్రాజెక్టును పక్కన పెట్టేశాడట. అందుకే వెంటనే నాగచైతన్య సినిమా ఓకే చేయించుకున్నాడన్న మాట.