రూట్ మార్చిన సీనియర్ హీరోయిన్స్!

  • November 13, 2017 / 04:08 PM IST

సినీ ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంటుంది. హీరోయిన్స్ విషయంలో మాత్రం ఈ పోటీ మరింత ఎక్కువ. వీరు పదేళ్లకంటే ఎక్కువగా పరిశ్రమలో ఉండడం కష్టం. ఏడాదికేడాది కొత్త హీరోయిన్స్ వచ్చి సీనియర్ హీరోయిన్స్ కి సవాలు ఇస్తుంటారు. అటువంటి అప్పుడు సీనియర్స్ తమ అనుభవానికి అభినయంతో పాటు అందని జోడించాల్సి ఉంటుంది. హాట్ గా హీట్ పుట్టించాల్సి ఉంటుంది. ఇదే మంత్రాన్ని నేటి సీనియర్ హీరోయిన్స్ లో కొంతమంది పాటిస్తున్నారు. వారే కాజల్ అగర్వాల్, శృతి హాసన్, త్రిష, శ్రియ. ఈ నలుగురికి మంచి హిట్స్ ఉన్నాయి. హోమ్లీగా అనేక పాత్రలు చేశారు. అయినా అవకాశాలు వారి తలుపు తట్టాలంటే కొంచెం గ్లామర్ ఒలకపోయాల్సిందే.

అందుకే త్రిష ఓ తమిళ మేగజైన్ కోసం హద్దులు దాటి ఎక్స్ పోజింగ్ ఇచ్చింది. మరో వైపు శ్రియ అండర్ వాటర్‎లో టూ పీస్ బికినీ‎తో రెచ్చిపోయింది. రిట్జ్ మేగజైన్ కోసం కాజల్, బాలీవుడ్ మేగజైన్స్ కోసం శృతి హాసన్ స్కిన్ షోతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. వయసుతో అందం కూడా పెరిగిందని ప్రసంశలు అందుకున్నారు. ఈ నలుగురికి స్కిన్ షో లు ఏ సినిమాలో ఛాన్స్ లు అందిస్తాయో.. చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus