కార్తీతో సీనియర్ హీరోయిన్ అసభ్య ప్రవర్తన..!

తాజాగా కోలీవుడ్ నటి కస్తూరి ప్రవర్తన పట్ల హీరో కార్తీ అసంతృప్తి చెందాడు. అవసరం లేకపోయినా కార్తీకి కోపం తెప్పించింది ఈ సీనియర్ నటి. విషయం ఏమిటంటే తాజాగా చెన్నైలో ‘జులై కాట్రిల్‌’ అనే తమిళ సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు కస్తూరి యాంకరింగ్ చేసింది. హీరో కార్తీ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ నేపథ్యంలో కస్తూరి.. కార్తీని సెల్ఫీ కావాలని అడుగుతూ… పరోక్షంగా కార్తీ తండ్రి శివకుమార్‌ను ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.. ‘మీ నాన్నగారు లేరు కదా.. రండి ఓ సెల్ఫీ దిగుదాం’ అంటూ కాస్త వెటకారంగా కామెంట్ చేసింది.

దీంతో కార్తీకి కోపం వచ్చింది. కస్తూరితో సెల్ఫీ దిగడానికి ఒప్పుకోకపోగా… నేరుగా మైక్‌ స్టాండ్‌ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతేకాదు ‘అనుమతి లేకుండా ఓ సెలబ్రిటీతో సెల్ఫీలు దిగేస్తే ఎంత అమర్యాదకరంగా ఉంటుందో కొంతమందికి తెలీదు. ఫోన్‌ నుండీ వచ్చే ఫ్లాష్‌లైట్‌ వల్ల మైగ్రేన్‌ సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి’ అని చెప్పి కార్తీ మండిపడ్డాడు. కొన్నాళ్ళ క్రితం కార్తీ తండ్రి శివకుమార్‌ ఓ ప్రారంభోత్సవ వేడుకకి వెళ్ళినప్పుడు ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా శివకుమార్‌కు కోపం వచ్చి ఫోన్‌ను విసిరిపారేశాడు. ఈ సంఘటన అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఆ తర్వాత శివకుమార్‌ తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడిస్తూ.. ఆ అభిమానికి సారీ కూడా చెప్పాడు. అంతేకాదు కొత్త ఫోన్‌ను కూడా కొనిచ్చాడు శివకుమార్. అంతా బాగానే సెట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు కస్తూరి ఈ టాపిక్ తీసుకురావడం.. కేవలం కార్తీకి మాత్రమే కాదు… వారి అభిమానులకి కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus