Naresh: వైరల్ అవుతున్న వీకే నరేష్ బోల్డ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

సీనియర్ నటులలో ఒకరైన వీకే నరేష్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. కామెడీ పాత్రలలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో మెప్పించే నటులలో వీకే నరేష్ ముందువరసలో ఉంటారు. తాజాగా భీమా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న వీకే నరేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భీమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు మాటలు రావడం లేదని ఆయన అన్నారు. భీమా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అని వీకే నరేష్ పేర్కొన్నారు.

భీమా ట్రైలర్ వండర్ ఫుల్ ట్రైలర్ అని ఆయన వెల్లడించారు. రఘుబాబు, నేను క్లాస్ మేట్స్, గ్లాస్ మేట్స్ అని వీకే నరేష్ చెప్పుకొచ్చారు. మేమిద్దరం మంచి నీళ్లు కలిసి తాగుతామని వీకే నరేష్ కామెంట్లు చేశారు. భీమా సినిమాలో కొత్త గోపీచంద్ ను చూస్తారని ఆయన అన్నారు. ఒక్కొక్క షాట్ లో రెండు వేరియేషన్స్ చూస్తారని ప్రతి సీన్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని నరేష్ వెల్లడించారు.

మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకులు కోరుకున్న ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కన్ను కొడుతూనే ఉంటారని వీకే నరేష్ వెల్లడించారు. వీకే నరేష్ కామెంట్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కు సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. భీమా సినిమాతో గోపీచంద్ కు భారీ హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గోపీచంద్ పారితోషికం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. గోపీచంద్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ సాధించాల్సి ఉంది. గోపీచంద్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గోపీచంద్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus