ఆర్యన్ ఖాన్ ప్రేమాయణం నిజమేనా..?

  • January 5, 2023 / 04:50 PM IST

సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్ లు కామనే. బాలీవుడ్ లో అయితే ఈ లవ్ ఎఫైర్స్ కి సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి ఇలాంటి ఒక వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో నటిగా సినిమాలు చేస్తోన్న నోరా ఫతేహితో ఆర్యన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నారట. ఇటీవల ఆర్యన్ ఓ ఫ్యాన్ తో కలిసి ఫొటో దిగారు.

అదే ఫ్యాన్ తో నోరా ఫతేహి కూడా సెల్ఫీ దిగడంతో వీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారని.. కచ్చితంగా డేటింగ్ లో ఉండుంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఆర్యన్ కంటే నోరా వయసులో ఐదేళ్లు పెద్దది. అదేం పెద్ద విషయం కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ డేటింగ్ వార్తలు వైరల్ అవ్వడంతో బాలీవుడ్ కి చెందిన కొందరు వ్యక్తులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలకు బాలీవుడ్ నటులంతా కలిసి ఒక దగ్గర కలుస్తుంటారని.. అలాంటప్పుడు వారిద్దరూ ఒకే చోట ఉండడం, ఫ్యాన్స్ తో కలిసి ఫొటోలు దిగితే.. డేటింగ్ లో ఉన్నారనుకోవడం పొరపాటు అని అంటున్నారు. గతంలో నోరా ప్రముఖ గాయకుడు గురు రాంధవాతో కలిసి నాచ్‌ మేరీ రాణీ అనే ఆల్బమ్‌ లో కలిసి ఆడిపాడారు. ఆ సమయంలో నోరా.. గురు రాంధవాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని గురు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆ తరువాత నోరా.. అంగద్ బేడీ అనే నటుడితో ప్రేమాయణం సాగించింది. కానీ అంగద్ అప్పటికే నేహా దుపియాతో ప్రేమలో ఉన్నాడు. నేహా గర్భం దాల్చడంతో ఆమెని పెళ్లి చేసుకొని నోరాని పక్కన పెట్టాడు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి నోరాకి చాలా సమయం పట్టింది. ఇప్పుడేమో ఆర్యన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ విషయంపై నోరా కానీ, ఆర్యన్ కానీ స్పందిస్తారేమో చూడాలి!

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus