ఏ కూతురికైనా తన తండ్రి మహారాజే… ఏ తండ్రికైనా తన కూతురు యవరాణే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. యితే కూతరుని యువరాణిగా అందరూ చూస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా ఆ తండ్రి మహారాజు అని ఫీల్ అవుతాడు. అచ్చంగా ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఆయన తనయ సుహానా ఖాన్ నటించిన సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దీంతో తన ఆనందాన్ని బయటపెట్టాడు. ఇదే క్రమంలో ఓ నెటిజన్ వెటకారంగా మాట్లాడేసరికి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చాడు.
ఇప్పుడు ఆ రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షారుఖ్ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ట్విటర్లో అభిమానులు, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ చిరాకు పుట్టించే ప్రశ్న వేశాడు. మీ పీఆర్ టీమ్ బాగా పని చేయడం వల్లే ఇటీవల మీరు నటించిన ‘జవాన్2, ‘పఠాన్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి అంటున్నారు.
ఈ సినిమా విషయంలో కూడా అలాగే విజయాన్ని అందుకుంటున్నారా? అని ఓ వ్యక్తి అడిగాడు. దానికి షారుఖ్ (Shah Rukh Khan) అదే రేంజిలో వ్యంగ్యంగా, చెంప చెల్లుమనిపించేలా రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అయితే బాద్షా అదరగొట్టాడు అంటున్నారు. ఆ కామెంట్ చేసిన ట్వీట్‌కు రిప్లైగా… మామూలుగా మీలాంటి తెలివైన వాళ్లకు రిప్లై ఇవ్వను. కాకపోతే మీ విషయంలో వెసులుబాటు కల్పించాను. ఎందుకంటే మీరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. అందుకే మీకు మందులు పంపించమని మా పీఆర్ టీమ్‌కు చెబుతాను.
త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్నాను అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు షారుఖ్. ‘ది ఆర్చీస్’ ప్రీమియర్‌లో సుహానాతో కలసి నడుస్తోన్న ఫొటో గురించి ఓ అభిమాని అడిగితే… ఆ క్షణం ఈ ప్రపంచానికి రాజునయ్యా అనే ఫీలింగ్ వచ్చింది అని చెప్పాడు షారుఖ్. మరి ‘ది ఆర్చీస్’తో సుహానా వెండితెరకు ఎంట్రీ ఇస్తోంది కదా.. మీ ఫీలింగ్ చెప్పండి అని అడిగితే.. పిల్లలు ఎదిగి కెరీర్లో తొలి అడుగువేయడం తల్లిదండ్రులకు ఎప్పుడూ సంతోషాన్నిస్తంది అంటూ సగటు తండ్రిలా చెప్పాడు షారుఖ్.