బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో షారూఖ్ ఖాన్ కు దేశ వ్యాప్తంగానూ, వరల్డ్ వైడ్ గానూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐదు పదుల వయస్సు దాటినా భారీ బ్లాక్ బాస్టర్లతో దుమ్ములేపుతున్నారు. షారుఖ్ ఖాన్ తన తాజా చిత్రం ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. దేశంలోనే అత్యంత సంపన్నుల హీరోల లిస్ట్ తీస్తే మొదటి స్ధాన్నంలో షారూఖ్ ఉంటారు. మొదటి నుంచి కూడా షారూఖ్ ఖాన్ తన అస్తుల గురించి అభిమానులతో పంచుకుంటాడు.
లాస్ ఏంజిల్స్‌లోని విలాసవంతమైన విల్లా షారూఖ్ ఖాన్ కలిగి ఉన్న ప్రతిష్టాత్మక ఆస్తులలో ఒకటి. అయితే ఈ భవనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎప్పడైనా యుఎస్ కి వెళ్లినట్లుయితే అక్కడ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ షారూఖ్ ఖాన్ కు సంబంధించిన ఎల్ ఏ విల్లా ఒకటి ఉంది. అయితే అది ఆయనేది కావచ్చు కానీ మనం కూడా అక్కడ ఎంజాయ్ చేయవచ్చు..
షారూఖ్ ఖాన్ తన విలాసవంతమైన విల్లాను అభిమానుల కోసం ఎర్బిన్ లో అద్దెకు అందుబాటులో ఉంచారు. ఈ విలావంతమైన విల్లాలో ఒక్క రోజు గడపటానికి సుమారు రూ.1.96 లక్షల చెల్లించాలంట.. అయితే ఈ విల్లాలో రోజుకు అంత చెల్లిచే అంత ఏముందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విల్లాలో ఆరు విశాలమైన బెడ్రూమ్లు, విశాలమైన జాకుజీలు, భారీ కొలనులు, కాబనాస్ మరియు టెన్నిస్ కోర్ట్‌ల ఉన్నాయి.
షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వెకేషన్ కు ఎక్కువగా లాస్ ఏంజిల్స్‌కు తరచుగా వెళ్తుంటారు. 2019 లో ఈ విల్లా లో ఎంజాయ్ చేసిన ఫోటోలను షారూఖ్ కొన్ని చిత్రాలను ట్విట్టర్లో పంచుకున్నాడు. ఈ ఫోటోలో స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చుకొని షారూఖ్ సూర్యోదయంను ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.