బాహుబలి కంక్లూజన్ కోసం ఎదురు చూస్తున్న షారుక్ ఖాన్

  • January 2, 2017 / 08:01 AM IST

దేశవ్యాప్తంగా షారుఖ్ ఖాన్ అభిమానులు ‘రాయీస్’ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురు చూస్తుంటే, ఆయన మాత్రం బాహుబలి కంక్లూజన్ సినిమాకోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా నటించిన తాజా చిత్రం  ‘రాయీస్’ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన ఆయన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్రం గురించి మాట్లాడారు. “బాహుబలి బిగినింగ్ చూసాను. చాలా బాగుంది. అందులో కట్టప్పగా సత్యరాజ్ నటన బాగా నచ్చింది. అతను నా “చెన్నై ఎక్స్ ప్రెస్” చిత్రంలో దీపిక తండ్రిగా నటించారు. అందులోను, ఇందులోనూ పాత్రకు న్యాయం చేశారు.

సత్యరాజ్ తో పాటు అందరూ వండర్ఫుల్ గా పర్ ఫార్మన్స్ ఇచ్చారు. ఈ మధ్య చూసిన సినిమాల్లో నాకు మంచి అనుభూతిని ఇచ్చిన సినిమా అది. దానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఉన్నాను. ఈ చిత్రం కూడా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా” అని వెల్లడించారు. ఆయన మాటలు బాహుబలి 2 పై అంచనాలను మరింత పెంచాయి. డిసెంబర్ 31 తో ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus