Pathaan: ఏవరేజ్ టాక్ తో కోట్లు వసూలు చేస్తోంది!

  • January 29, 2023 / 11:56 PM IST

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వస్తోన్న సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో బాలీవుడ్ పనైపోయిందని.. ఇక రికవరీ కష్టమేననే మాటలు వినిపించాయి. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పరిస్థితి కూడా ఇలానే అవుతుందని మాట్లాడుకున్నారు. ఈ సినిమాకి వ్యతిరేకంగా కాంపెయిన్ కూడా జరిగింది. కానీ ఈ నెగెటివ్ ప్రచారం వలన ‘పఠాన్’కి ఎలాంటి నష్టం జరగలేదు.

ఈ సినిమా ట్రైలర్ షారుఖ్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులకు కూడా నచ్చింది. వేరే కారణాల వలన కూడా ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే ఈ సినిమా వసూళ్ల మోత మోగించడం ఖాయమని అనుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే రిలీజ్ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. తరువాత రెండు రోజుల్లో మరింత దూసుకుపోయింది.

మొత్తం మూడు రోజుల్లో ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. ఒక్క ఇండియాలోనే ‘పఠాన్’ రూ.200 కోట్లు వసూలు చేయగా.. ఓవర్సీస్ లో కలెక్షన్స్ రూ.110 కోట్లు దాటిపోయాయి. వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పుంజుకుంటాయని ఆశిస్తున్నారు. ఎలా లేదన్నా.. ఐదు రోజుల్లో ఈ సినిమా రూ.500 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయం.

బాలీవుడ్ లో వచ్చిన బడా సినిమాలు లాంగ్ రన్ లో ఐదొందల కోట్లను వసూలు చేయడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ కేవలం ఐదు రోజుల్లో ఆ ఫీట్ ను అందుకునేలా ఉంది. ఏవరేజ్ టాక్ తోనే ఈ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే.. ఇక హిట్ టాక్ వచ్చి ఉంటే మరోలా ఉండేది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus