Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

ఈరోజు హైదరాబాద్, శిల్పకళా వేదికలో ‘ప్యారడైజ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ను ఘనంగా నిర్వహించారు. దీనికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన కొన్ని భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

Dil Raju


దిల్ రాజు మాట్లాడుతూ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంత పెద్ద అభిమానినో అందరికీ తెలుసు. ఆయనతో కలిసి నేను ‘వకీల్ సాబ్’ సినిమాను నిర్మించే అదృష్టం దక్కించుకున్నాను. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. నేను ఇచ్చిన రెమ్యూనరేషన్‌తోనే అప్పట్లో ఆయన తన పార్టీని నడిపానని ఎంతో గొప్పగా చెప్పారు. కానీ, నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్న విషయం అదికాదు.

‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత కోవిడ్ కారణంగా పరిస్థితులు మారిపోయి మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము.సినిమా థియేటర్ రన్ కి ఇబ్బంది వచ్చి పడింది. ఆ టైంలో నేను ఆయనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ పారితోషికం రూ. 5 కోట్లను పవన్ కళ్యాణ్ గారు సున్నితంగా తిరస్కరించారు. నిర్మాతకు నష్టం రాకూడదనే ఉద్దేశ్యంతో ఆ డబ్బులు ఆయన తీసుకోలేదు.. దటీజ్ పవర్ స్టార్!” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు దిల్ రాజు.

అయితే, దిల్ రాజు ఈ వేదికపై పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. ‘ప్యారడైజ్’ సినిమా వైజాగ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కుల బిజినెస్‌లో భాగంగా.. నిర్మాత సుధాకర్ చెరుకూరికి దిల్ రాజు ఒక భారీ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారట. కానీ, ఆ ఆఫర్‌ను సుధాకర్ గారు తిరస్కరించారట. తనకు అంత పెద్ద మొత్తం వద్దని, తగ్గించి ఇవ్వమని చెప్పి.. తక్కువకే ఇచ్చారట. భారీ బడ్జెట్ సినిమా తీసి కూడా అందరూ బాగుండాలనే అతని గొప్ప మనసుకోసమైనా ప్యారడైజ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని దిల్ రాజు తెలిపారు.

అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి అదే గొప్ప మనసు, నిజాయితీ.. నిర్మాత సుధాకర్ చెరుకూరిలో కూడా ఉన్నాయని దిల్ రాజు ఉద్దేశం కావచ్చు.

అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus