షాలిని పాండేతో సరసాలాడనున్న నిఖిల్

నిఖిల్ నెక్స్ట్ ఫిలిమ్ గా రూపొందనున్న ‘కనితన్’ తెలుగు రీమేక్ లో హీరోయిన్ ఎవరనే విషయమై ఇప్పటికే పలు వార్తలొచ్చాయి. మొదట్లో హీరోయిన్ గా తమిళ వెర్షన్ లో నటించిన కేతరీన్ చేయనుందని కథనాలు వెలువడ్డాయి. అయితే.. కేతరీన్ స్వయంగా రంగంలోకి దిగి నేనా సినిమా చేయడం లేదు అని చెప్పడంతో ఆమె నటించడం లేదు అనే వార్త కఫ్నర్మ్ అయ్యింది. ఆతర్వాత మేఘా ఆకాష్ పేరు కూడా వినిపించింది. మేఘా ఆకాష్ ను ఈ విషయమై సంప్రదించగా ఆమె కూడా సింపుల్ గా “ప్రస్తుతం “చల్ మోహనరంగా” తప్ప వేరే సినిమా ఏదీ ఒప్పుకోలేదు. ఏదైనా సరే ఆ సినిమా విడుదలయ్యాకే” అని రిప్లై ఇచ్చింది.

మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అని దర్శకనిర్మాతలను సంప్రదించగా ఇప్పటివరకూ వచ్చిన వార్తలన్నీ కల్పితాలే.. ఈ చిత్రంలో నిఖిల్ సరసన కథానాయికగా షాలిని పాండేను తీసుకొంటున్నట్లు తెలిపారు. “అర్జున్ రెడ్డి”తో సూపర్ హిట్ అందుకొన్న తర్వాత షాలినిపాండే తెలుగులో సినిమాలు అంగీకరించలేదు. తమిళంలో మాత్రం వరుసగా మూడు సినిమాలు సైన్ చేసింది. అందుకు కారణాలు ఏవైనా షాలిని పాండేను మళ్ళీ తెలుగులో చూడకపోవడం పట్ల ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు నిఖిల్ సినిమా సైన్ చేయడం మరియు ఇంకొన్ని సినిమాలకు కూడా ఆమెను అడుగుతుండడంతో త్వరలోనే ఆమె బిజీకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus