Shankar: శంకర్ కు నెక్స్ట్ హీరో దొరికేశాడు.. కానీ..!

కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ డైరెక్టర్ శంకర్‌తో  (Shankar) సినిమా చేయాలని ప్రతి హీరో ఎదురుచూసేవారు. కానీ ‘ఇండియన్ 2’ (Indian 2)   ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నిరాశపరిచిన తరువాత, ఆయన క్రేజ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. శంకర్ మార్క్ గ్రాండ్ విజువల్స్ ఉన్నప్పటికీ, కథలు అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ఇప్పుడు ‘ఇండియన్ 3’ పనులు కాస్త నెమ్మదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఇండియన్ 3’ షూటింగ్ చాలావరకు పూర్తయినా, ఆ సినిమాపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అంతగా ఆసక్తి చూపించడం లేదని టాక్.

Shankar

భారీ బడ్జెట్ కారణంగా వచ్చిన నష్టాల కారణంగా, ఈ ప్రాజెక్ట్‌ను రెడ్ జెయింట్ పిక్చర్స్ టేకోవర్ చేసిందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేకపోవడంతో, శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటనే చర్చ మొదలైంది. ఇటీవల శంకర్ ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం వేల్పూరి నవల ఆధారంగా ఉంటుందని హింట్ ఇచ్చారు. కానీ హీరో ఎవరు అనేది చెప్పలేదు.

తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, అజిత్ కుమార్‌తో (Ajith)  ఈ ప్రాజెక్ట్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అజిత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే ఈ డిస్కషన్ జరగనుందని సమాచారం. అయితే అజిత్ కూడా రీసెంట్‌గా ‘పట్టుదల’తో (Vidaamuyarchi)  నిరాశపరిచారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’  (Good Bad Ugly) సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమా విజయాన్ని బట్టి అజిత్ తదుపరి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ రావొచ్చు. శంకర్‌కు మళ్లీ స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారా? లేక మరో యంగ్ హీరోను ఎంచుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, శంకర్ మరో భారీ విజువల్ స్పెక్టాకల్‌ను తెరపైకి తీసుకురావడానికి రెడీ అవుతారని కోలీవుడ్ టాక్. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే స్పష్టత రావొచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఆ దర్శకుడికి నాగ్ ఓకే చెబుతాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus