కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమా 1996 సంవత్సరం మే నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆతరం ప్రేక్షకులతో పాటు ఈతరం ప్రేక్షకులకు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 తెరకెక్కుతుండగా చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైనా మధ్యలో కొన్ని ఆవాంతరాలు ఎదురవడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.
అయితే నిర్మాతలు మారడంతో తాజాగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే ఈ సినిమా నిడివి చాలా ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి. 3 గంటల 10 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత నిడివితో విడుదలైన సినిమాలు తక్కువేననే సంగతి తెలిసిందే. ఎక్కువ నిడివి కొన్ని సినిమాలకు ప్లస్ అయితే మరికొన్ని సినిమాలకు మాత్రం మైనస్ అవుతోంది. షూటింగ్ పూర్తి కాకుండానే రన్ టైమ్ గురించి వైరల్ అవుతున్న వార్తలు కమల్ శంకర్ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి.
శంకర్ గత సినిమాలు కూడా ఎక్కువ నిడివితో తెరకెక్కగా ఈ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. విక్రమ్ తర్వాత రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో కమల్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.
తెలుగు, తమిళంతో పాటు ఇతర ముఖ్యమైన భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. శంకర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇండియన్2 సినిమాపై కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు సైతం భారీ ఆశలు పెట్టుకున్నాయని సమాచారం.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!