Indian 2: శంకర్‌ పని పూర్తి చేశారా? సినిమా రిలీజ్‌ చేసేస్తారా? ఎప్పుడొస్తుందంటే?

Advertisement

ఒక హీరో ఫ్యాన్స్‌… మరో హీరో సినిమా రిలీజ్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటే ఎంత గొప్ప విషయమో చెప్పండి. అలా అని ఆ హీరో మీద అమితాభిమానం ఉంది అనుకునేరు. ఈ విషయం మీకు పర్‌ఫెక్ట్‌గా అర్థం కావాలంటే ఆ రెండు సినిమాల పేర్లు చెప్పేయాలి. అప్పుడు క్లియర్‌ అవుతుంది. ఆ సినిమాలు ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer), ‘భారతీయుడు 2’(Indian 2). ఇప్పుడు ఏ హీరో అభిమానులు ఏ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది.

యస్‌… చరణ్‌ (Ram Charan) ఫ్యాన్స్‌ కోసమే ఇదంతా. ఎందుకంటే ‘భారతీయుడు 2’ అప్‌డేట్ సాయంత్రం వచ్చేస్తోంది. ‘గేమ్ ఛేంజర్’, ‘భారతీయుడు 2’… ఈ రెండు సినిమాలను దర్శకుడు శంకర్‌ పారలల్‌గా తెరకెక్కిస్తూ వచ్చారు. అయితే కొద్దిగా ఆయన ఎక్కువ రోజులు ‘భారతీయుడు’ సెట్స్‌లో ఉన్నారను అనుకోండి. సినిమా షూటింగ్ అయిపోయింది కానీ… రిలీజ్‌ డేట్ ఇంకా చెప్పలేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అయ్యాక చెబుతారు అని టీమ్‌ ఇన్నాళ్లూ అంది.

అయితే ఈలోపు ‘భారతీయుడు 3’ కూడా తీసేశాం అని చెప్పి షాక్‌ ఇచ్చారు. దీంతో ‘భారతీయుడు 2’ అయినా వచ్చేస్తే శంకర్‌ ( Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ను సీరియస్‌గా తీసుకొని పూర్తి చేస్తారని చరణ్‌ ఫ్యాన్స్‌ ఆశ. శంకర్ సినిమా రిలీజ్ డేట్‌ ఫిక్స్ చేయడంలో ఆయన నిర్ణయం తప్ప నిర్మాతలకు ప్రమేయం ఉండదు అంటుంటారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలో దిల్‌ రాజు కూడా ఇదే మాట చెప్పారు. ‘భారతీయుడు 2’ విషయంలోనూ ఇలానే చేసి డేట్‌ను లాక్‌ చేశారట.

జూన్ 13న సినిమాను రిలీజ్‌ చేస్తారట. ఆ డేట్‌కి ఎన్నికల హడావుడి అయిపోతుంది కాబట్టి.. ఆ డేట్ అయితేనే కరెక్ట్‌ అనుకుంటున్నారట. ఏప్రిల్ 14 ఈ సినిమా టీజర్‌ కూడా వస్తుందట. తమిళ సంవత్సరం సందర్భంగా కమల్‌హాసన్‌ (Kamal Haasan) అభిమానులకు ఆ టీజర్‌ గిఫ్ట్‌ అట. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కొనేసుకుంది. సినిమా ఫలితం బట్టి స్ట్రీమింగ్‌ తేదీ నిర్ణయిస్తారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news