Sharwanand: శర్వానంద్ కొత్త సినిమా బడ్జెట్ లెక్కలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నా ఈ మధ్య కాలంలో శర్వానంద్ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఏకంగా 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. అయితే శర్వానంద్ సినిమాపై ఈ స్థాయిలో ఖర్చు చేయడం రిస్క్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు ఏ రేంజ్ లో అమ్ముడవుతాయో చూడాల్సి ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఖర్చు విషయంలో అదుపు తప్పితే ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. శ్రీరామ్ ఆదిత్య ట్రాక్ రికార్డ్ సైతం ఆశించిన విధంగా లేదనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సినిమాలు తీసే దిశగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం గమనార్హం. పీపుల్స్ మీడియా బ్యానర్ లో తెరకెక్కిన రామబాణం సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చి అభిమానులకు భారీ షాకివ్వడంతో పాటు పీపుల్స్ మీడియాకు షాకిచ్చింది. శ్రీరామ్ ఆదిత్య కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

100 సినిమాలు టార్గెట్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం. శర్వానంద్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని నెటిజన్లు భావిస్తున్నారు. శర్వానంద్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శర్వానంద్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. (Sharwanand) శర్వానంద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus