George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

మొన్నీమధ్య హీరో నాగార్జున చెప్పిన మాటల్ని సీరియస్‌గా తీసుకున్నారో, లేక కొత్త ఒరవడిని సృష్టిద్దాం అనుకున్నారో, లేక తాము రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలనుకున్నారో తెలియదు కానీ.. శర్వానంద్‌ కొత్త సినిమా టీమ్‌ ఓ ప్రయోగం చేశారు. అది సినిమా కథలోనో, సినిమా ప్రచారంలోనో కాదు.. సినిమాను అనౌన్స్‌ చేయడంలో, సినిమాకు కొబ్బరికాయ కొట్టడంలో. ఆ సినిమా టీమ్‌ ఏం చేసిందో చెబితే.. మీరు కూడా ఇదే మాట అంటారు.

George Krish

శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో అనిల్ సుంకర ఓ సినిమాను ప్రకటించారు. ఇలా చెబితే ఈ సినిమా గురించి తక్కువ చేసినట్లే అవుతుంది. ఎందుకంటే సినిమాకు క్లాప్ కొట్ఇన రోజే టైటిల్‌, రిలీజ్ డేట్, డిస్ట్రిబ్యూటర్ల వివరాలు అన్నీ చెప్పేశారు. నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేస్తామని నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాకు చెప్పినట్లు ఇప్పుడు చెప్పేశారు. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింతపుతున్నాం అని చెబుతూ జనవరి 14 అంటూ రిలీజ్‌ డేట్‌ చెప్పేశారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫుల్‌ కాస్ట్‌ అండ్‌ క్రూ రెడీ అంటున్నారు. త్వరలోనే వారి వివరాలు కూడా ప్రకటిస్తారట. టైటిల్‌లో ఓ జంట ప్రేమగా ఉన్నట్లు బొమ్మలు వేశారు. వెనుక హవర్ గ్లాస్‌ (గాజు సీసా తరహాలో ఏర్పాటులో ఇసుక కిందకు జారే టైమర్‌) ను పెట్టారు. అంటే సమయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. సంక్రాంతి స్పెషల్‌ అని కూడా రాశారు.

శర్వానంద్‌ కెరీర్‌లో విజయం సాధించిన సినిమాల్లో ఎక్కువ శాతం సంక్రాంతికి వచ్చినవే. అందుకే ఆ సెంటిమెంట్‌తో పక్కాగా సంక్రాంతికి వస్తాం అని చెబుతున్నారు అనిపిస్తోంది. వచ్చ సంక్రాంతికి వస్తాం అంటూ కొన్ని సినిమాలు ఇప్పటికే చెప్పేసినా.. ఎవరూ డేట్‌ చెప్పలేదు. కానీ శర్వా ఇప్పుడు చెప్పాడు.

ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus