Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

గంటల తరబడి మొబైల్‌ ఫోన్‌ వాడేవాళ్లకు వైద్యులు ఎప్పుడూ ఓ మాట చెబుతుంటారు. అంతసేపు ఫోన్‌ వాడొద్దు. వీలైనంతవరకు యూసేజీ తగ్గించండి అని. ఆ మాట వినకపోతే ఏమువుతంది అనే చిన్న లీనియర్‌నెస్‌ తీసుకొని కొంతమంది ఫోన్‌ వాడుతూనే ఉంటారు. అలాంటి వారికి సీనియర్‌ నటి షకీలా ప్రస్తుత పరిస్థితి గురించి చెబితే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో ఫోన్‌ వినియోగం విషయంలో కంట్రోల్‌ అవుతారు. అంతలా ఏమైంది అనుకుంటున్నారా?

Shakeela

ఇటీవల తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి షకీలా అభిమానులతో పంచుకున్నారు. మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని ఆమె చెప్పారు. అంతేకాదు దీని వల్ల సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీనికి రూ.3 లక్షల వరకు ఖర్చయింది అని కూడా చెప్పారు షకీలా. ఫోన్‌లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్/ షార్ట్‌ వీడియోలు చూడటం వల్ల తనకీ పరిస్థితి వచ్చిందని షకీల చెప్పారు.

నిద్రపోయే సమయంలో ఒక పక్కకు వాలి గంటలు గంటలు ఫోన్ చూడటంతో మెడలోని నరాలపై ప్రభావం పడిందని, అందుకే ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఫోన్ ముఖ్యం. కానీ, అవసరానికి మించి వాడకండి. ఉపయోగం లేని వీడియోలను చూస్తూ సమయం వృథా చేయకండి. మొబైల్‌ సరిగ్గా వాడకపోతే డబ్బులు పోవడమే కాకుండా, నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. చిన్న పిల్లలకు ఫోన్‌ ఇవ్వడంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని తగ్గించాలి అని షకీల స్వీయానుభవంతో సూచించారు.

తొలినాళ్లలో మలయాళ సినిమాను యేలిన నటి షకీలా. ఒక రకమైన సినిమాలు చేస్తూ ఒకానొక దశలో అగ్ర హీరోలకు పోటీనిచ్చారు. ఆ తర్వాత ఇతర భాషల్లోనూ ఆమె నటించారు. అలా తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశారు. మధ్యలో గ్యాప్‌ తీసుకొని మళ్లీ నటించిన ఆమె మునపటి ఫామ్‌లోకి రాలేకపోయారు. ఇప్పుడైతే పెద్దగా సినిమాలు చేయడం లేదు.

మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus