టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శర్వానంద్ ఈ ఏడాది మొదటిలో రక్షిత రెడ్డి అనే అమ్మాయిని ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా నిశ్చితార్థ వేడుకకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తరలివచ్చారు. ఇక వీరి నిశ్చితార్థం జరిగి దాదాపు 5 నెలలు అవుతుంది. ఇంకా వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉండటమే కాకుండా పెళ్లి గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అసలు వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారా అనే సందేహం కూడా అందరిలో మొదలైంది.
ఈ విధంగా (Sharwanand) శర్వానంద్ వివాహం క్యాన్సిల్ అయింది అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు అంటూ తాజాగా శర్వానంద్ టీమ్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా శర్వానంద్ పెళ్లి గురించి తన టీమ్ స్పందిస్తూ…శర్వానంద్ రక్షిత ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారని ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని తెలిపారు.
అయితే వీరి పెళ్లి ఆలస్యం కావడానికి మరే కారణాలు లేవు ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత శర్వానంద్ తన పెళ్లి పై ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తాజాగా ఈ సినిమా 40 రోజుల పాటు లండన్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొని తిరిగి ఇండియా వచ్చారు.
అయితే ప్రస్తుతం శర్వానంద్ హైదరాబాద్ లోనే ఉన్నారని త్వరలోనే ఇరువురు కుటుంబ సభ్యులు గురించి మాట్లాడి పెళ్లి తేదీని ప్రకటించబోతున్నారు అంటూ ఈ సందర్భంగా శర్వానంద్ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆయన టీం స్పష్టం చేశారు. ఇలా శర్వానంద్ తన సినిమా కారణంగానే తన పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నారని తెలుస్తోంది.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!