శివ జ్యోతి 30వ పుట్టినరోజు వేడుకలు ఫోటోలు వైరల్!

శివ జ్యోతి అందరికీ సుపరిచితమే. తీన్మార్ సావిత్రిగా ఈమె సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుని.. తర్వాత బిగ్ బాస్3 లోకి ఎంట్రీ ఇచ్చి తన గేమ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన జీవితంలో చాలా ట్రాజెడీ ఉండడంతో ఈమె చాలా మందికి కనెక్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. అదే క్రమంలో శివ జ్యోతి.. హౌస్ లో ఎంతసేపు ఏడుస్తూ ఉండడం కొంతమందిని విసిగించేది. అయినా ఈమె ఆడిన మైండ్ గేమ్స్ అందరికీ నచ్చేవి. శివ జ్యోతి తనకు బిగ్ బాస్ లో పరిచయమైన అలీ రెజా, సీరియల్ నటుడు రవి, రోహిణి, హిమజ వంటి వారితో నిజజీవితంలో కూడా ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తుంది.

వీరితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు శివ జ్యోతి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వీళ్లంతా హాజరవుతూ ఉంటారు. ఇక హౌస్ కు గెస్ట్ గా ఓసారి ఆమె భర్త గంగూలీ వస్తే అతన్ని కూడా పాపులర్ చేసేసింది శివ జ్యోతి. ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు తన భర్త గురించి గొప్పగా చెబుతూనే..

తన గురించి భర్త పడిన కష్టాలు చెబుతుండేది. దీంతో అతను కూడా ఓ మినీ సెలబ్రిటీ అయిపోయాడు. ఇక వాలెంటైన్స్ డే రోజున శివ జ్యోతి పుట్టిన తన పుట్టినరోజుని కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఇది తన 30వ పుట్టినరోజు అని సింబాలిక్ గా 30 నెంబర్ చూపిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus