Shiva Jyothi: ఘనంగా శివజ్యోతి కొత్త ఇంటి గృహప్రవేశం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

నాగంపేట గ్రామం, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంకి చెందిన శివ జ్యోతి… తీన్మార్ సావిత్రి గా బాగా ఫేమస్ అయ్యింది. ఓ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే తీన్మార్ అనే ఫన్నీ న్యూస్ ప్రోగ్రాం ఈమెను బాగా ఫేమస్ చేసింది. బిత్తిరి సత్తి తో కలిసి ఈమె వార్తలను అందరికీ చేరువయ్యే విధంగా ఫన్నీగా చెప్పడంతో ఈ ప్రోగ్రాంకి ఎక్కువ జనాదరణ దక్కింది. ఈ షో వల్ల శివ జ్యోతికి ‘బిగ్ బాస్ 3’ లో పాల్గొనే అవకాశం కూడా దక్కింది.

‘బిగ్ బాస్ 3’ లో కూడా తన పాజిటివ్ నేచర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన క్రేజ్ ను ఇంకా పెంచుకుంది. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ లో ఈమెకు ఆఫర్లు ఎక్కువగా వచ్చాయి. బుల్లితెరపై కూడా పలు షోలలో ఈమె సందడి చేస్తుంది. శివ జ్యోతి.. గంగూలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అతనితో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. మరోపక్క ఈమె సొంత ఇల్లు కూడా నిర్మించుకుంది.

బి.ఎం.డబ్ల్యు కారు కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో ఇంటిని కూడా నిర్మించింది. తాజాగా శివజ్యోతి కొత్తింటి గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus