Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?
- September 7, 2026 / 11:52 AM ISTByFilmy Focus Desk
ఒక సినిమా విజయం టాలీవుడ్‌లో జనాల మైండ్‌సెట్‌లో ఎంతటి మార్పులు తీసుకొస్తుంది అనేది మీకు తెలియాలా? అయితే శివ నిర్వాణను చూడండి మీకే అర్థమైపోతుంది. అలాగే పొగుడుతున్నట్లు ఒక మాట అని.. దాంతోపాటే ఓ సెటైర్ ఎలా వేయాలి అనేది తెలియాలంటే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదే డైరక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) స్పీచ్ వినండి అర్థమైపోతుంది. ఇదంతా జరిగింది ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది.
Shiva Nirvana, Vaishnavi Chaitanya
గత కొన్ని నెలలుగా ఏ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో, సక్సెస్ మీట్‌లో.. ఇలా ఏ కార్యక్రమంలో కూడా కనిపించని దర్శకుడు శివ నిర్వాణ ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించారు. గత కొన్ని నెలలుగా ఆయన బిజీగా ఉన్నారో.. లేక ఎవరూ పిలవలేదో కానీ ఇప్పుడు అయితే వచ్చారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆయన ఇదే వేదిక మీద ఓ కామెంట్ చేశారు. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటిగా ఎంతో ఎదిగిందని చెప్పిన శివ నిర్వాణ.. గతంలో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.

తాను తెరకెక్కించిన ‘టక్ జగదీష్’ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో ఓ సీన్‌లో రౌడీ వచ్చి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నడుము గిల్లాలి. ఆ సీన్ చెబితే అప్పుడు వైష్ణవి వద్దని చెప్పిందట. ఆ సన్నివేశంలో వైష్ణవి ఇబ్బంది పడిందని చెప్పారు. అలాంటి వైష్ణవిని ‘బేబీ’ సినిమాలో చూసి ఆమె కన్విక్షన్‌కి ఆశ్చర్యపోయా అని చెప్పారు. ‘బేబీ’ సినిమా కాంబో ఇంత వేగంగా రిపీట్ అవ్వడం కూడా ఆనందంగా ఉందని చెప్పారాయన.

ఈ మాటల్లో దెప్పి పొడవడం ఏంటి అనే ప్రశ్న రావొచ్చు. ఎందుకంటే ‘టక్ జగదీశ్’ సినిమాకు ‘బేబీ’ సినిమాకు గ్యాప్ రెండేళ్లలోనే. ఈ రెండేళ్లలోనే ఆమె ఆలోచనలో ఈ మార్పులు రావడం పెద్ద విషయమే. అందుకే శివ నిర్వాణ (Shiva Nirvana) ఇలా అన్నారు అనిపిస్తోంది. లేదంటే మెచ్చుకుంటూ కూడా అని ఉండొచ్చు.
రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. రిస్క్ చేసిందా?












