Ghost Movie: కన్నడ ఘోస్ట్ టీం షాకింగ్ నిర్ణయం.. మేటర్ ఏంటి అంటే?

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. దసరా కానుకగా ఈ సినిమా అక్కడ రిలీజ్ అయ్యింది. కానీ టాక్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది. అయితే శివరాజ్ కుమార్ కి ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. అయితే అక్టోబర్ 26 న ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలి అనుకున్నారు. వాస్తవానికి దసరా కానుకగా తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇక్కడ పెద్ద సినిమాలు ఉండటం వల్ల చేయలేదు.

రెండో వారం అంటే అక్టోబర్ 26 నాటికి తెలుగు డబ్బింగ్ పనులు కంప్లీట్ కాలేదు. పైగా (Ghost Movie) ఘోస్ట్ అనే పేరుతో నాగార్జున సినిమా కూడా వచ్చింది కాబట్టి.. టైటిల్ మార్చాలని ప్రెజర్ కూడా పడింది. దీంతో ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ పేరు ముందుగా పెట్టి టైటిల్ మార్చారు. అయినా మేకర్స్ కి తెలుగులో రిలీజ్ చేయాలన్న ఆలోచన లేనట్టు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రెండో వారానికి కన్నడంలో కలెక్షన్స్ పూర్తిగా డౌన్ ఆగిపోయాయి.

కానీ తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో నవంబర్ 4 న రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ప్రమోషన్ కి మాత్రం వీరు ఇంట్రస్ట్ చూపించడం లేదు. అక్టోబర్ 26 న రిలీజ్ అనుకునప్పుడు ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంటాము అని చిత్ర బృందం తెలిపిందట. కానీ ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చి ప్రమోషన్ చేయడానికి ఫైట్ ఖర్చులు వేస్ట్ అన్నట్టు వారు భావిస్తున్నట్లు సమాచారం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags