ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా, అందాలు ఆరబోయగల ధైర్యం ఉన్నా.. అభినయంతో అలరించగలిగే సత్తా ఉన్నా.. అదృష్టం కలిసిరాకపోతే ఎంతటి అందాల భామ అయినా అవకాశాల్లేక బాధపడాల్సిందే. అయితే.. రాజశేఖర్ రెండో కూతురైన శివాత్మిక మాత్రం వరుస సినిమాలు సైన్ చేస్తూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించే పనిలో బిజీ అయిపోతోంది. ఆల్రెడీ కృష్ణవంశీ దర్శకత్వంలో “రంగమార్తాండ” చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న శివాత్మిక.. ఇప్పుడు హీరోయిన్ గా తన రెండో సినిమా సైన్ చేసింది.
అరుణ్ ఆదిత్ హీరోగా దుర్గా నరేష్ గుత్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శివాత్మికను కథానాయికగా ఫైనల్ చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం కూడా నేడు హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో శివాత్మిక మంచి హిలేరియస్ క్యారెక్టర్ ప్లే చేయనుంది. ఈ ఏడాది తాను నటించే సినిమాల్లో కనీసం మూడు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తోంది శివాత్మిక. చూస్తుంటే.. అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.