పరిధి దాటిపోయిన బాలయ్య-బోయపాటి సినిమాల బడ్జెట్

రీసెంట్ టైమ్స్ లో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకొనే “జై సింహా” ఓవరాల్ కలెక్షన్ 50 కోట్ల రూపాయలు. అది కూడా పోటీగా విడుదలైన “అజ్ణాతవాసి” డిజాస్టర్ గా నిలవడంతో బాలయ్య ఆ అత్యధిక మొత్తాన్ని సాధించగలిగాడు. సొ బాలయ్య సినిమా మీద ఒక 40 కోట్ల దాకా ఖర్చు చేయొచ్చు అనే ధీమాతో 30 నుంచి 40 కోట్ల రూపాయల దాకా సునాయాసంగా ఖర్చు చేస్తున్నారు మన నిర్మాతలు. కానీ.. ఇప్పుడు బాలయ్య 106వ సినిమాకి బోయపాటి ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం దర్శకుడిగా బోయపాటి ఆల్రెడీ 15 కోట్ల రూపాయలు తీసుకొంటుండగా.. తన రెమ్యూనరేషన్ గా బాలయ్య 10 కోట్ల రూపాయలు తీసుకోనూన్నాడు. ఇక్కడికే 25 కోట్లు ఖర్చవ్వగా.. హీరోయిన్లు, విలన్స్ కి ఒక 5 కోట్లు. సపోర్టింగ్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్, షెడ్యూల్ ఖర్చులు మొత్తం కలిపి ఈజీగా 70 కోట్ల బడ్జెట్ కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టగల బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కు ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. హీరోగా బాలయ్య మీద ఈస్థాయిలో ఖర్చు చేయడం అనేది మాత్రం రిస్కే.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus