‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). మరికొన్ని రోజుల్లో అంటే జూన్ 27న ఆయన ‘కుబేర’ తో (Kubera) ప్రేక్షకులను పలకరించనున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇందులో హీరోలుగా నటించారు. ధనుష్ సరసన రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’ ‘అమిగోస్ క్రియేషన్స్’ బ్యానర్లపై పుస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్(Suniel Narang), శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ఒకటి, రెండు పాటలు టీజర్ బయటకు వచ్చాయి. ఇవి సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. తమిళంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రైలర్ లాంచ్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యేసరికి 3 గంటల వరకు రన్ టైం వచ్చినట్టు టాక్ నడుస్తుంది.
మరోపక్క ఈ సినిమా బడ్జెట్ కూడా బాగా పెరిగినట్టు ఇన్సైడ్ టాక్. ముందుగా ఈ చిత్రం బడ్జెట్ రూ.90 కోట్లు అనుకున్నారట. కానీ తర్వాత అది రూ.120 కోట్ల వరకు పెరిగిందట. వడ్డీలతో కలుపుకుని దాని లెక్క రూ.150 కోట్లకు చేరుకుంది అని సమాచారం. ఓటీటీ రైట్స్ రూపంలో రూ.47 కోట్లు వచ్చాయి అని వినికిడి.
‘కుబేర’ సినిమా 2021 లోనే సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ 2 ఏళ్ళు డిలే అయ్యింది. పైగా ఈ సినిమాకు గాను ధనుష్ రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారు. నాగార్జున కూడా రూ.20 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఇలా బడ్జెట్ క్రమక్రమంగా పెరుగుతూనే వచ్చింది అని స్పష్టమవుతుంది.
KUBERAA: Budget Breakdown
Initial Estimated Budget : ₹90 Cr
Final Production Cost : ₹120 Cr
Budget Including Interest : ₹150 Cr
OTT Rights Sold For : ₹47 Cr#kuberaa #Nagarjuna #Dhanush pic.twitter.com/0E01zCVav7
— Phani Kumar (@phanikumar2809) June 9, 2025