నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ సూరి పాత్రలో నటించారు.
టీజర్, ట్రైలర్ రెండు పాటలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. మొదటి రోజు సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే అందరూ ఒక్కటే కంప్లైంట్. ప్రమోషన్స్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి చాలా గొప్పగా చెప్పాడు. ‘కాంతార’ రేంజ్ లో ఉండబోతోంది సినిమా అని.. ఇండియన్ సినిమాకి నా కాంట్రిబ్యూషన్ ఇతనే అని.. ఇప్పటి వరకు హీరోయిన్లనే పరిచయం చేశాను.. వాళ్ళు టాప్ హీరోయిన్లు అయ్యారు.
చాలా మంది డైరెక్టర్స్ ని పరిచయం చేశాను.. వాళ్ళలో కూడా టాప్ రేంజ్ కు వెళ్లిన వాళ్ళు ఉన్నారు. అయినా నాతో సినిమాలు చేశారు, చేస్తున్నారు. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ స్టార్ డైరెక్టర్ అయిపోతాడు. మళ్ళీ నాతో సినిమా చేస్తాడో లేదో’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. అయితే ఇవి నాని చేసిన ఫన్నీ కామెంట్స్ అనే అనుకోవాలి.
ఎందుకంటే శ్రీకాంత్ (Srikanth Odhela) రొటీన్ కథల్నే తీసుకుని నానిని, కీర్తి సురేష్ ను కొత్తగా చూపించాడు. వాళ్ళ తర్వాత సినిమాకి ఎక్కువగా పనిచేసింది టెక్నికల్ టీం మాత్రమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.