జాన్వీ తీరుని తప్పుపడుతున్న బాలీవుడ్ వర్గాల వారు

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ బిల్డప్ లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. స్టార్ హీరోయిన్ కూతురిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఏడాది కూడా తిరగకముందే ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ లో ఫీల్ అయిపోతోంది. ఆమె నటించిన దఢక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. స్టార్ హీరోలకు సమానంగా ఆ చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది. ఇంకేముంది ఓ వైపు సినిమా ఆఫర్లు.. మరో వైపు బ్రాండింగ్ చేయాలనీ ప్రముఖ సంస్థలు క్యూలో ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా జాన్వీ లెవల్ మారిపోయింది. ఆమె ధరించే దుస్తులు, యాక్ససరీస్ విలువ లక్షల్లో ఉంటున్నాయి. అంతేకాదు.. ఆమె చాలా బిజీ అయిపోయిందని పీఆరో టీమ్ చేసే హడావుడి ఇంతా అంతాలేదు. భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

దఢక్ మూవీ తర్వాత ఒక సినిమాకి సంతకం చేసింది. మరో మూవీ చర్చల దశలో ఉంది. ఇలాంటి సమయంలో తన తండ్రి బోనీ కపూర్ కి జాన్వీ కపూర్ డేట్లు లేవు అంటూ నో చెప్పిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా బోనీ ఒక చిత్రం నిర్మించేందుకు జాన్వీ కపూర్ డేట్లు అడగడం జరిగిందని కాని జాన్వీ బిజీగా ఉండటం వల్ల తండ్రికి డేట్లు ఇవ్వలేక పోయిందని మీడియాలో జాన్వీ పీఆర్ టీం ప్రచారం చేస్తోంది. కేవలం ఒక్క సినిమాను చేస్తున్న జాన్వీ అంత బిజీగా ఉందా? అంటూ బాలీవుడ్ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే అంతవద్దు అని చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ హైప్ వద్దని సలహా ఇస్తున్నారు. మరి ఈ సలహాలను జాన్వీ తీసుకొని తీరు మార్చుకుంటుందో.. లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus