సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కుష్బూ అందరికీ సుపరిచితమే.ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. ఒకానొక సమయంలో ఈమెకు గుడి కట్టారు అంటే ఈమె అప్పటి కుర్రకారుని తన గ్లామర్ తో ఏ స్థాయిలో అలరించి కలల రాకుమారిగా మారిందో అర్థం చేసుకోవచ్చుమారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 1986 లో కె.రాఘవేంద్రరావు -వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత ‘కెప్టెన్ నాగార్జున’ ‘త్రిమూర్తులు’ ‘భారతంలో అర్జునుడు’ ‘కిరాయి దాదా’ ‘మారణ హోమం’ ‘చిన్నోడు పెద్దోడు’ ‘శాంతి క్రాంతి’ ‘పేకాట పాపారావు’ ‘స్టాలిన్’ ‘యమదొంగ’ ‘కథానాయకుడు’ ‘అజ్ఞాతవాసి’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కుష్బూ దర్శకుడు సుందర్‌ను పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు అవంతిక, అనందిత. కుష్బూ తన కూతుర్ల ఫోటోలు షేర్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారు.
కుష్బూ కూడా ఈ విషయం పై మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఒకరి ఫిజికల్ అప్పీరెన్స్ ను డీ గ్రేడ్ చేసి క్రిటిసైజ్ చేయడం అనేది తప్పుడు. ఈ విషయంలో నెటిజన్లు చాలా సార్లు హద్దులు దాటుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. కుష్బూ ఇటీవల తన కూతుర్లతో దిగిన ఫోటోని షేర్ చేస్తే.. వాటిని చూసిన ఓ నెటిజన్..
వాళ్ళ ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు కుష్బూ.. “20, 22 సంవత్సరాల వయసున్న వారికి కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరంఉందా?. చిన్న పిల్లల మీద ట్రోలింగ్స్ చేయటం సిగ్గుచేటు. కనీసం వాళ్ళనైనా వదిలేయండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?