నివేదా థామస్ తెలుగు ప్రేక్షకులకు అవసరం లేని పేరు.నాని- ఇంద్రగంటి కాంబినేషన్లో వచ్చిన ‘జెంటిల్ మన్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన నివేదా థామస్ అటు తర్వాత ‘నిన్ను కోరి’ ‘జై లవ కుశ’ ‘118’ ‘బ్రోచేవారెవరురా’ ‘వకీల్ సాబ్’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె రెజీనా తో కలిసి నటించిన ‘శాకిని డాకిని’ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.
‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘గురు ఫిలిమ్స్’, ‘క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్’ పై డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రమోషన్లు కూడా షురూ చేశారు. ఇదిలా ఉండగా.. మొదట్లో కాస్త బొద్దుగా ఉండే నివేదా థామస్ అటు తర్వాత సన్నబడింది.
‘శాకిని డాకిని’ ప్రమోషన్స్ లో కూడా ఆమె స్లిమ్ గానే కనిపిస్తుంది. అయితే ఇటీవల నివేదా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన సోదరుడు నిఖిల్ థామస్ తో కలిసి ‘శాకిని డాకిని’ చిత్రంలోని సాంగ్ కి డాన్స్ చేసింది. అయితే ఈ వీడియోలో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో ఆమె చాలా లావుగా కనిపిస్తుంది. దీంతో ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. బుల్లి తెడ్డి బేర్ లా ఉంది అంటూ ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!