స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ రిలీజ్ డేట్ మారగా త్వరలో సలార్ మూవీ రిలీజ్ డేట్ కూడా మారే ఛాన్స్ అయితే ఉంది. ఒక స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు నాలుగు నెలల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కావడం ఏ మాత్రం మంచిది కాదు. అయితే సలార్ ను పోస్ట్ పోన్ చెయ్యడానికి బదులుగా ప్రీ పోన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కొన్ని నెలల క్రితం మరణించగా ఆయన మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది. అయితే కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు ఆస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. కృష్ణంరాజు ఆస్తిపై ఇకనుంచి ప్రభాస్ కు పూర్తి అధికారాలు ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. కృష్ణంరాజు కూతుళ్ల పెళ్లి బాధ్యతల భారం కూడా ప్రభాస్ పై ఉండనుందని తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వార్తల గురించి కృష్ణంరాజు ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇకపై కుటుంబానికి ప్రభాస్ పెద్ద దిక్కుగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రస్తుతం వేగంగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.
ఈ మూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలు హిట్టైనా ప్రభాస్ కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా అభిమానుల ఆశలు తీరతాయో లేదో చూడాల్సి ఉంది. ప్రతి సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసే విధంగా ప్రభాస్ అడుగులు వేస్తుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.