ఈ ఏడాది హిట్టైన సినిమాల్లో ఇది గమనించారా?

  • November 7, 2022 / 01:52 PM IST

2022 సంవత్సరంలో సక్సెస్ సాధించిన సినిమాల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో సినిమాల బడ్జెట్ ఊహించని స్థాయిలో పెరగడంతో గతంతో పోల్చి చూస్తే సినిమాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఈ ఏడాది హిట్టైన సినిమాలలో క అక్షరంతో తెరకెక్కిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ సాధించాయి. 2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో కేజీఎఫ్2 సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్2 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

యశ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా కూడా క అక్షరంతో తెరకెక్కి సంచలన విజయం సొంతం చేసుకుంది. కాంతార సినిమా ఇప్పటికీ థియేటర్లలో ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కశ్మీర్ ఫైల్స్ కూడా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి అంచనాలను మించి సక్సెస్ అందుకుంది.

సౌత్ ఇండియాతో పోల్చి చూస్తే నార్త్ ఇండియాలో ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. మరో సినిమా కార్తికేయ2 కూడా అంచనాలను మించి సక్సెస్ సాధించింది. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది హిట్టైన సినిమాలలో మెజారిటీ సినిమాలు క అక్షరంతో తెరకెక్కడం హాట్ టాపిక్ అవుతోంది.

ఈ సెంటిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో క అక్షరంతో తెరకెక్కే సినిమాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచిన ఈ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus