టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో గతేడాది సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. రేపు శర్వానంద్ నిశ్చితార్థం జరగనుండగా శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షితారెడ్డితో శర్వానంద్ వివాహం జరగనుంది. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారని సమాచారం. ఈ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలుస్తోంది.
ప్రస్తుతం శర్వానంద్ వయస్సు 38 సంవత్సరాలు కాగా ఇప్పటివరకు పెళ్లిపై ఆసక్తి చూపని శర్వానంద్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ పెళ్లికి అంగీకారం తెలిపారని సమాచారం. రక్షితారెడ్డి తండ్రి మధుసూధన్ రెడ్డి హైకోర్టు లాయర్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది సమ్మర్ లో శర్వానంద్ రక్షితా రెడ్డి వివాహం జరగనుందని సమాచారం అందుతోంది. నిశ్చితార్థం సింపుల్ గా జరిగినా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగనుందని సమాచారం.
అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పిన శర్వానంద్ పెళ్లి విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది మరి కొందరు యంగ్ హీరోలు కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. శర్వానంద్ పెళ్లి తేదీకి సంబంధించి మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. శర్వానంద్ కెరీర్ పరంగా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
త్వరలో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. క్లాస్ సినిమాలతోనే శర్వానంద్ ఎక్కువగా విజయాలను సొంతం చేసుకున్నారు. చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా సక్సెస్ అయిన శర్వానంద్ వివాదాలకు దూరంగా ఉంటారు. శర్వానంద్ సినిమాలతో పరిచయమైన డైరెక్టర్లు ప్రస్తుతం మంచి పొజిషన్ లో ఉన్నారు. శర్వానంద్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.