Niharika, Akhil: నిహారిక అఖిల్ నటించిన షార్ట్ ఫిల్మ్ గురించి తెలుసా?

  • November 8, 2022 / 07:02 PM IST

అక్కినేని హీరోలలో ఒకరైన అఖిల్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ Aలేకపోవడంతో ఏజెంట్ సినిమాపైనే అఖిల్ ఆశలు పెట్టుకున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. “అఖిల్” సినిమాతో అఖిల్ హీరోగా పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు ముందు అఖిల్, నిహారిక కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు మినహా చాలామందికి ఈ విషయం తెలియదు. తాజాగా మెగా డాటర్ నిహారిక ఒక కుకింగ్ షోలో పాల్గొని ఈ షార్ట్ ఫిల్మ్ గురించి వెల్లడించడంతో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదంటూ నిహారిక చివర్లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ షార్ట్ ఫిల్మ్ కళాఖండం అంటూ నిహారిక సెటైర్లు వేయడం గమనార్హం.

అయితే ఆ షార్ట్ ఫిల్మ్ ను ఇప్పుడు రిలీజ్ చేసినా రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిహారికకు సొంతంగా పలు యూట్యూబ్ ఛానెళ్లు ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో నిహారిక ఆ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

ఈ షార్ట్ ఫిల్మ్ కు రాజమౌళి కొడుకు కార్తికేయ డైరెక్టర్ అని సమాచారం. ఈ షార్ట్ ఫిల్మ్ లో నిహారిక ఆశ అనే పాత్రలో కనిపించారని బోగట్టా. డబ్బుల కంటే పరువు ముఖ్యమని ఆ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేయబోమని నిహారిక చెబుతున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ కోరుతున్న నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ రాబోయే రోజుల్లో యూట్యూబ్ లో రిలీజ్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus