Nidhhi Agerwal: నిధితో ఆ పూజ చేయించిన వేణుస్వామి.. అవకాశాలు పెరుగుతాయా?

  • March 29, 2023 / 12:05 AM IST

(Nidhhi Agerwal) టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వేణుస్వామిని కలిసి తమ జాతకం చెప్పించుకుంటూ ఉంటారు. వేణుస్వామి పూజలు చేసిన తర్వాత రష్మికకు కెరీర్ పరంగా కలిసొచ్చిందని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. రష్మిక ఇప్పటికీ వరుసగా సినిమా ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రష్మిక జాతకాన్ని వేణుస్వామి మార్చిన విధంగా నిధి జాతకాన్ని కూడా మార్చబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా నిధి అగర్వాల్ తో వేణుస్వామి పూజలు జరిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిధి అగర్వాల్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నిధి లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వేణుస్వామి నిధితో రాజశ్యామల యాగం చేయించారని తెలుస్తోంది. ఈ యాగం వల్ల నిధి అగర్వాల్ కెరీర్ కు మేలు జరిగితే మరి కొందరు హీరోయిన్లు సైతం ఈ యాగం దిశగా అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంది.

హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఆఫర్లు వస్తాయని నిధి భావిస్తున్నారు. ఈ యాగం నిధి కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి. వరుస విజయాలతో నిధి విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పారితోషికం కోటి రూపాయల కంటే తక్కువ మొత్తం కావడం గమనార్హం.

నిధి అగర్వాల్ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇతర హీరోయిన్లకు భిన్నంగా కెరీర్ విషయంలో నిధి అగర్వాల్ అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోలకు జోడీగా అవకాశాల కోసం నిధి అగర్వాల్ ఎదురుచూస్తున్నారు. కెరీర్ పరంగా నిధి అగర్వాల్ కు ఈ ఏడాది కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus