హీరోయిన్ ప్రత్యూష హత్య వెనుక ఉన్న సీక్రెట్స్..!

  • July 2, 2020 / 02:46 PM IST

హీరోయిన్ ప్రత్యూష గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ.. అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈమె బాగా సుపరిచితమే. మోహన్ బాబు ‘రాయుడు’ ‘శ్రీరాములయ్య’ ‘స్నేహమంటే ఇదేరా’ ‘కలుసుకోవాలని’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిజానికి అప్పుడప్పుడే ఈమె క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతున్న రోజులవి. కానీ సడెన్ గా ఈమె మరణిందన్న వార్త టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది. ‘ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రత్యూష ప్రేమలో పడిందని..

ఈ విషయాన్ని తన తల్లి దండ్రులకు తెలియజెయ్యగా వారు ఒప్పుకోలేదని.. అందువల్లనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించారు. అయితే ఈమెను దారుణంగా అత్యాచారం చేసారని.. అప్పట్లో కథనాలు కూడా వినిపించాయి. కొంతమంది వైద్యులు ఈ విషయాన్ని తెలియజేసినట్టు టాక్ వినిపించింది. రాజకీయ నాయకుల కొడుకులు ముగ్గురు కలిసి హీరోయిన్ ప్రత్యూషను దారుణంగా రేప్ చేసి చంపేశారని.. నిందితుల పెద్ద పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో.. ప్రత్యూష హత్యని.. ఆత్మహత్యగా తప్పుదోవ పట్టించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈమె కేసు కూడా ఎక్కువ రోజులు కొనసాగించలేదని.. త్వరగానే క్లోజ్ చేసారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘దిశా’ ఘటనలో నిందితులైన వారిని ఎంకౌంటర్ చేసిన పోలీసులు.. ప్రత్యూష కేసులో నిందితులైన వారిని ఊరికే వదిలేసినట్టు కూడా మొన్నటి వరకూ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus